Jump to content

ఒంటరి (సినెమా)

వికీపీడియా నుండి
(ఒంటరి నుండి దారిమార్పు చెందింది)
ఒంటరి
దర్శకత్వంబి.వి.రమణ
రచనమరుధూరి రాజా, భాష శ్రీ
స్క్రీన్ ప్లేబి.వి.రమణ
నిర్మాతపోకూరి బాబు రావు
తారాగణంగోపీచంద్, భావన,
ఛాయాగ్రహణంసర్వేష్ మురారి
కూర్పుగౌతంరాజు
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఫిబ్రవరి 14, 2008 (2008-02-14)
సినిమా నిడివి
142 ని
భాషతెలుగు

ఒంటరి బి. వి. రమణ దర్శకత్వంలో 2008 లో విడుదలైన చిత్రం. ఇందులో గోపీచంద్, భావన ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పోకూరి బాబురావు ఈతరం ఫిలింస్ పతాకంపై నిర్మించాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు.[1]

వంశీకృష్ణ ధనవంతుడైన వస్త్ర వ్యాపారి ముద్దుకృష్ణారావు కొడుకు. అతను బుజ్జి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ అమ్మాయి ఒక అనాథ. హాస్టల్లో ఉంటుంది. తల్లిదండ్రుల అనుమతితో ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు వంశీ. కానీ నిశ్చితార్థానికి ముందే బుజ్జిని కొంతమంది దుండగులు అపహరిస్తారు. లాల్ మహంకాళి అనే ముఠానాయకుడి తమ్ముడైన పాండా ఆమెను పాడు చేయబోగా వంశీ అతన్ని కొడతాడు. మహంకాళి అతని మీద పగ తీర్చుకోవడం కోసం పెళ్ళికి ముందు బుజ్జిని అపహరించి వంశీ ముందే ఆమెమీద అత్యాచారం చేస్తాడు. ఇదంతా ఎమ్మెల్యే రాఘవ సహకారం వల్ల సాధ్యమవుతుంది. రాఘవ వంశీకి దగ్గర స్నేహితుడు. రాఘవకు మంత్రి పదవి ఆశచూపి మహంకాళి అతనిచేత వంశీని కత్తితో పొడిపిస్తాడు. వంశీ ఆ ప్రమాదం నుంచి బయటపడి ముఠాను వెతుక్కుంటూ హైదరాబాదు వస్తాడు. రాఘవ చేసిన మోసాన్ని తెలుసుకుని అతన్ని చంపుతాడు. తర్వాత పోలీసు ఎ.సి.పి వంశీ తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడంతో వంశీ భ్రమలో ఉన్నట్లు తెలుస్తుంది. అతను కేసును పరిశీలించి వంశీని పట్టుకుంటాడు కానీ అతను చంపించి నేరస్థులను అని చెప్పి వదిలేస్తాడు. వంశీ తర్వాత మహంకాళిని చంపేసి పాండా ఒక చెయ్యి నరికేస్తాడు. చివరలో వంశీకి నిజానికి బుజ్జి నిశ్చితార్థానికి ముందే పైనుంచి ఒక రాయి మీద పడి మరణించిందని చెబుతాడు.

తారాగణం

[మార్చు]

సంగీతం :పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు.

అరెరే ఏమైంది, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. హేమచంద్ర,, మాళవిక

చెప్పాలని ఉంది , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.ఎస్.పి.చరణ్ , కల్పన

లక్ష్మీ క్షీర సముద్ర , శ్లోకం , గానం.ఉష.

వర్రీ వర్రీ రచన: భాషాశ్రీ , గానo. నవనీ

నీ జిమ్మడ, రచన: భాస్కర భట్ల, గానం. రాహూల్ నంబియార్ , అనిత కార్తీకేయన్

ఒమారే ఓమారే , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.రంజిత్ , అనురాధ శ్రీరామ్

మూలాలు

[మార్చు]
  1. "Ontari - Telugu cinema Review - Gopichand & Bhavana". www.idlebrain.com. Retrieved 2020-07-26.