ఏఱు
స్వరూపం
(ఏరు నుండి దారిమార్పు చెందింది)
ఏరు లేదా ఏఱు అనగా చిన్న నది. ఇది సామాన్యంగా ఒక పెద్ద నదికి ఉపనదిగా ఉండి చివరికి సముద్రంలో కలిసిపోతుంది. ఇవి సామాన్యంగా తక్కువ లోతు ఉంటాయి.
కొన్ని ఏరులు
[మార్చు]- చెయ్యేరు - పెన్నా నదికి ఉపనది.
- తాలిపేరు - గోదావరి నదికి ఉపనది.
- పాలేరు - కృష్ణా నదికి ఉపనది.
- మున్నేరు - కృష్ణా నదికి ఉపనది.
- సగిలేరు - పెన్నా నది యొక్క ఉపనది.
సామెతలు
[మార్చు]ఏఱు మీద కొన్ని తెలుగు సామెతలు.[1]
- ఏఱు దాటిన తరువాత తెప్ప తగలేసినట్లు
- ఏఱు దాటే దాకా ఓడ మల్లయ్య ఏఱు దాటాక బోడి మల్లయ్య
- ఏటికి ఎన్ని నీళ్ళు వచ్చినా కుక్కకు గతుకునీళ్ళే
- ఏటీతకూ లంకమేతకూ సరి
- ఏటొడ్డు చేనూ నూతొడ్డు బిడ్డా
- ఏట్లో వేసినా ఎంచి వేయాలి
- ఏఱు ఎన్ని వంకలు బోయినా సముద్రంలో కలవక తప్పదు
- ఏఱు పోయిందే పల్లం, ఏలిక చెప్పిందే న్యాయం
- ఏఱు ముందా ? ఏకాదశి ముందా ?
మూలాలు
[మార్చు]- ↑ జాతీయ సంపద, తెలుగు నేర్చుకునేవారికి సామెతలు, జాతీయాలు, భవిష్యనిధి వివరణలతో, ఆరి శివరామకృష్ణయ్య, 2008.