Jump to content

ఎం. ఎల్. నరసింహారావు

వికీపీడియా నుండి
(ఎం.ఎల్.నరసింహారావు నుండి దారిమార్పు చెందింది)
ఎం.ఎల్.నరసింహారావు
జననంమాదిరాజు లక్ష్మీనరసింహారావు
(1928-11-07)1928 నవంబరు 7
India పండితాపురం గ్రామం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం2016 ఫిబ్రవరి 12
హైదరాబాదు
ఉద్యోగంతెలుగు అకాడమీ
ప్రసిద్ధికార్యదర్శి, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం
పదవి పేరుఅసిస్టెంట్ ప్రొఫెసర్
మతంహిందూ
భార్య / భర్తప్రమీలాదేవి
పిల్లలుఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు

మాదిరాజు లక్ష్మీ నరసింహారావు (నవంబరు 7, 1928 - ఫిబ్రవరి 12, 2016) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త.[1]

విశేషాలు

[మార్చు]

ఇతడు ఖమ్మం జిల్లా కామేపల్లిమండలం పండితాపురం గ్రామంలో 1928, నవంబరు 7వ తేదీన జన్మించాడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు. గాంధీజీ సిద్ధాంతాలకు ప్రభావితుడయ్యాడు. తెలుగు అకాడమీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. కోఠిలోని శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయంలో గత 50 ఏళ్లుగా కార్యదర్శిగా, [2] గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ వ్యవస్థాపకులుగా, గాంధీ పీస్ ఫౌండేషన్ కార్యదర్శిగా సేవలందించారు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2012వ సంవత్సరంలో భార్య ప్రమీలాదేవి మరణించారు.

మరణం

[మార్చు]

ఇతడు 2016, ఫిబ్రవరి 12వ తేదీన హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[4][5]

పదవులు

[మార్చు]
  • కార్యదర్శి - శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం
  • సాధారణ కార్యదర్శి - ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల సంఘం
  • కోశాధికారి - తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల సంఘం
  • సెనెట్ మెంబర్ - ఉస్మానియా విశ్వవిద్యాలయం
  • వ్యవస్థాపకుడు - గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్
  • కార్యదర్శి - గాంధీ పీస్ ఫౌండేషన్
  • ట్రస్టీ - గాంధీ భవన్, హైదరాబాదు
  • సలహా సంఘసభ్యుడు - ఆకాశవాణి, హైదరాబాదు[6]
  • సలహా సంఘసభ్యుడు - దూరదర్శన్, హైదరాబాదు
  • సభ్యుడు - ఫిలిం సెన్సార్ బోర్డ్, హైదరాబాదు
  • సభ్యుడు - తెలుగు ఉర్దూ నిఘంటు పథక సంఘం - ఉర్దూ అకాడమీ

రచనలు

[మార్చు]

ఇతడు దాదాపు 38 గ్రంథాలను రాజకీయ, చారిత్రక అంశాలపై రచించాడు.[7] వాటిలో కొన్ని:

  1. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు
  2. స్వాతంత్ర్య సమర సేనానులు
  3. నూరుగురు తెలుగు ప్రముఖులు
  4. స్వాతంత్ర్య సారథులు
  5. స్వామి రామానంద తీర్థ
  6. సేవాపరాయణ సీతయ్యగుప్త
  7. లోక్‌నాయక్ జయప్రకాష్
  8. సాహసమూర్తి జె. ఈశ్వరీబాయి
  9. తెలంగాణ ప్రముఖులు
  10. తెలంగాణ వైతాళికులు
  11. తెలంగాణ చరిత్ర : ఉద్యమాలు - పోరాటాలు
  12. హైదరాబాదు స్వాతంత్ర్య ఉద్యమం - తెలంగాణ
  13. వందేమాతరం
  14. మాడపాటి హన్మంతరావు జీవిత చరిత్ర
  15. వినోబా జీవితం - ఉద్యమం
  16. మొరార్జీదేశాయ్
  17. ఇందిరాగాంధీ జీవితచరిత్ర
  18. జాతీయోద్యమ నిర్మాతలు
  19. భారత జాతీయ కాంగ్రెస్ ఆంధ్రుల పాత్ర
  20. నెహ్రూల పరంపర
  21. 20వ శతాబ్ది తెలుగు వెలుగులు
  22. ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు
  23. ప్రభాకర్‌జీ సంస్మరణ గ్రంథం
  24. ప్రతిభా వైజయంతి ( పి.వి.నరసింహారావు సన్మాన సంచిక - ప్రధాన సంపాదకుడు)
  25. శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం 100 సంవత్సరాల సంక్షిప్త చరిత్ర
  26. రాజీవ్ గాంధీ సంక్షిప్త జీవిత చరిత్ర
  27. షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర
  28. మహాత్మా గాంధీ సంక్షిప్త జీవిత చరిత్ర
  29. Hyderabad Freedom Movement - Telangana

పురస్కారాలు

[మార్చు]
  • తెలుగు విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్.
  • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం.
  • తెలుగు విశ్వవిద్యాలయం వారిచే అయ్యంకి వెంకటరమణయ్య పురస్కారం.
  • అఖిల భారతీయ భాషా సమ్మేళనం, భోపాల్ వారిచే సాహిత్యశ్రీ బిరుదు.
  • సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిచే శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం.

మూలాలు

[మార్చు]
  1. గాంధేయవాది లక్ష్మీనరసింహారావు అస్తమయం 13-02-2016[permanent dead link]
  2. Library that continues to inspire By Dasu Kesava Rao Friday, Nov 19, 2004, The HIndu
  3. "Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam". Archived from the original on 2016-03-05. Retrieved 2016-02-14.
  4. గాంధేయవాది లక్ష్మీనరసింహారావు అస్తమయం[permanent dead link]
  5. స్వాతంత్ర్యయోధులు ఎం.ఎల్.నరసింహారావు మృతి[permanent dead link]
  6. ఆంధ్రభాషా నిలయ అర్చక శేఖరుడు జీవితచరిత్రల రచనా ధిషణుడు - సన్నిధానం నరసింహశర్మ[permanent dead link]
  7. "మాదిరాజు లక్ష్మీనరసింహారావు మృతి SAT,FEBRUARY 13, 2016". Archived from the original on 2016-02-25. Retrieved 2016-02-14.

బయటి లింకులు

[మార్చు]