ఉషాపరిణయం (సినిమా)

వికీపీడియా నుండి
(ఉషా పరిణయము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఉషాపరిణయం
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బి.నాగభూషణం
నిర్మాణం కె.బి.నాగభూషణం
తారాగణం తాడేపల్లి కాంతారావు,
జమున,
ఎస్.వి. రంగారావు,
కన్నాంబ,
కల్యాణం రఘురామయ్య,
రాజనాల కాళేశ్వరరావు
పి.సూరిబాబు
సంగీతం ఎస్. హనుమంతరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సూరిబాబు,
కళ్యాణం రఘురామయ్య,
కె.జమునారాణి,
పి.సుశీల,
మాధవపెద్ది సత్యం,
పి.బి.శ్రీనివాస్,
పి.లీల
గీతరచన సదాశివబ్రహ్మం,
సముద్రాల
నిర్మాణ సంస్థ శ్రీ రాజ రాజేశ్వరీ ఫిలిం కంపెనీ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఉషాపరిణయం (Usha Parinayam) 1961 లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకం మీద కడారు నాగభూషణం, కన్నాంబ దర్శక నిర్మాత, నటులుగా నిర్మించిన పౌరాణిక చిత్రం.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]
పాత్ర నటీనటులు
అనిరుద్ధుడు తాడేపల్లి కాంతారావు
ఉష జమున
బాణాసురుడు ఎస్.వి. రంగారావు
బాణాసురుని భార్య కన్నాంబ
కృష్ణుడు కళ్యాణం రఘురామయ్య
నారదుడు పి.సూరిబాబు
శివుడు రాజనాల కాళేశ్వరరావు
కోలాహలం రేలంగి వెంకట్రామయ్య
ఇంద్రుడు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
రాజగురువు ముక్కామల కృష్ణమూర్తి
పేకేటి శివరాం

పాటలు

[మార్చు]

ఈ సినిమాలో 23 పాటలు, పద్యాలు ఉన్నాయి.

  1. అదిగో మనప్రేమ చెలువారు సీమ - పి.బి. శ్రీనివాస్, కె. జమునారాణి
  2. అందాలు చిందేటి ఈ వనసీమలో ఆనందడోలల ఊగెదమా - కె.జమునారాణి బృందం
  3. ఆతడు విష్ణుమూర్తి పరమాత్ముడు (పద్యం) - పి. సూరిబాబు
  4. ఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకో - పిఠాపురం నాగేశ్వరరావు,?
  5. కరునారసభరితా సరసజలోచన జననీ జగదంబా - పి. లీల
  6. జయజయ శ్రీ రాజరాజేశ్వరి మము దయజూడుమా నిను సేవింతుమో - కె. జమునారాణి
  7. జయ మహదేవా శంభో గిరిజారమణా శివపరాత్పరా - మాధవపెద్ది సత్యం, పి. లీల బృందం
  8. నాకున్ ముద్దు అనిరుద్దుపై నెపుడు సంతాపంబు (పద్యం) - కె. రఘురామయ్య
  9. నిన్నే వలచితినోయి ఓ బావా నిన్నే పిలిచితినోయి - కె.జమునారాణి
  10. న్యాయమిదేనా చంద్రుడా నీ న్యాయమిదేనా అసహాయను నను - పి.సుశీల
  11. పాలాక్షుండు మహోగ్రమూర్తి (పద్యం) - మాధవపెద్ది సత్యం
  12. బాణనందన ఉషాబాల ప్రాణలతో ఆడెడు ( పద్యం ) - పి. సూరిబాబు
  13. బ్రతికి ఫలంబేమి ఏకాకినై ఇటుపై ఎడబాటులాయే - పి.బి.శ్రీనివాస్, కె.జమునారాణి
  14. మధుకైటభుల మున్ను (సంవాద పద్యాలు) - పి.సూరిబాబు, మాధవపెద్ది సత్యం
  15. మన ప్రేమగాధ అమరకథ అనుపమై నిలచి - ఘంటసాల, పి. లీల, రచన: సదాశివ బ్రహ్మం
  16. సరసిజదళ నయనా క్షీరాబ్దిశయనా - పి. సూరిబాబు
  17. శుభోదయమున సమాగమంది మనొఙ్ఞరూపా మమ్మేలరా - కె. జమునారాణి బృందం
  18. శ్రీమన్ మహాదేవ దేవ పరంజ్యోతి (దండకం) - మాధవపెద్ది సత్యం
  19. నను బ్రోవ రావేల నా స్వామి , కె.జమునా రాణి
  20. భక్తి పాశంబు కడు బలవత్తరంబు హరిహారులకైన (పద్యం), కె.రఘురామయ్య
  21. సురులు మునివరులైన నిను తెలియగలరా కృష్ణా, పి.సూరిబాబు
  22. వందే శంభుo ఉమాపతిo సురగురుం వందే జగత్కారణం (పద్యం),మాధవపెద్ది
  23. నీకున్ బుత్రుడు నాకు పౌత్రుడు గదా(పద్యం), కె.రఘురామయ్య .

వనరులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]