ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్
స్వరూపం
(ఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 1976 లో స్వచ్ఛంద సంస్థగా నమోదయ్యింది.[1] వైజ్ఞానిక రీతులలో చరిత్ర అధ్యయనాలను ప్రోత్సహించడం దీని ప్రధానవుద్దేశ్యం. 1998లో జరిగిన 22 వ సావంత్సరిక సదస్సులో సమగ్ర చరిత్రను 7 సంపుటాలలో మొత్తం 5000 ముద్రించిన పేజీలలో రూపొందించాలని నిర్ణయించారు. 2008 వార్తల ఆధారంగా 9 సంపుటాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికి 300 మంది పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఈ పనికి 1960లో బీజం బడగా 1970 లో అప్పటి అంతర్జాతీయ తెలుగు సంస్థ, ఆ తరువాత తెలుగు అకాడమీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం కృషిచేశాయి. మేధో పరంగా ఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్, ఆర్థిక పరంగా తెలుగువిశ్వవిద్యాలయం దీనిలో పాల్గొంటున్నాయి.[2]
- 2003 లో మొదటి సంపుటి, పూర్వయుగము నుండి క్రీ పూ500 వరకు [3] ఎమ్ ఎల్ కె మూర్తి సంపాదకత్వంలో విడుదలైంది.[4]
- రెండవసంపుటి: ఆంధ్ర ప్రదేశ్ తొలి చరిత్ర (క్రీపూ 500- క్రీశ 640) ( Early History of Andhra Pradesh 500 B.C. to 640 A.D.)
- 2009 లో మూడవ సంపుటి తొలి మధ్యయుగ ఆంధ్ర ప్రదేశ్[5] బి రాజేంద్రప్రసాద్ సంపాదకత్వంలో విడుదలైంది.
- 10 జూలై 2011 నాడు నాలుగో సంపుటం ” మధ్య యుగాల తెలుగు చరిత్ర(సా.శ.1000-1324) ” విడుదలైంది.[6]
- ఆధునికచరిత్ర మూడు సంపుటాలు (1325నుండి 1991 వరకు ) తయారీలో ఉన్నాయి.
వనరులు
[మార్చు]- ↑ "తెలుపు.కామ్ లో వివరము". Archived from the original on 2012-07-19. Retrieved 2012-07-21.
- ↑ 2015 నాటికి 9 సంపుటాల చరిత్ర ఆంధ్రప్రభలో 2008లో వచ్చిన వార్త[permanent dead link]
- ↑ Pre and Protohistory till 500BC (పూర్వయుగము నుండి క్రీ పూ500 వరకు) గూగుల్ బుక్స్ లో మునుజూపు
- ↑ "Looking back in time , news story on first volume release in 2003". Archived from the original on 2010-11-28. Retrieved 2012-07-21.
- ↑ "Early Medieval Andhra Pradesh, Vol 3 ( తొలి మధ్యయుగ ఆంధ్ర ప్రదేశ్,మూడవ సంపుటి) తూలికబుక్స్ లో సమీక్ష". Archived from the original on 2016-04-05. Retrieved 2012-07-21.
- ↑ నాలుగో సంపుటం విడుదలవార్త[permanent dead link]