అసిడియేషియా
(అసిడియన్ నుండి దారిమార్పు చెందింది)
అసిడియేషియా కాల విస్తరణ:
| |
---|---|
![]() | |
Halocynthia sp. | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | కార్డేటా
|
Subphylum: | |
Class: | అసిడియేషియా Nielsen, 1995
|
Orders | |
అసిడియేషియా (Ascidiacea ; commonly known as the ascidians or sea squirts) యూరో కార్డేటా (Urochordata) తరగతికి చెందిన సముద్రంలో నివసించే జీవ జాతులు. ఇవి ఒక సంచి వలె కనిపించే అకశేరుకాలు. అసిడియన్లు ట్యూనిసిన్ అనే గట్టి పొరను కలిగివుంటాయి.[2]
ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇవి తక్కువ లోతున్న నీటిలో లవణాల శాతం 2.5 శాతం కన్నా ఎక్కువ కలిగిన పరిస్థితులలో నివసిస్తాయి. ఇవి స్థానబద్ధ జీవులుగా రాతి మీద అతుక్కొని ఉంటాయి.
వీనిలో సుమారు 2,300 జాతులు మూడు రకాలుగా గుర్తించబడ్డాయి
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/22/Haeckel_Ascidiae.jpg/220px-Haeckel_Ascidiae.jpg)
లక్షణాలు
[మార్చు]- ఇవి సరళ లేక సహనివేశక జీవులు
- గ్రసని మీద అడ్డు వరుసలలో ఏర్పడిన శైలికామయ శ్వాసరంధ్రాలు లేక మొప్పచీలికలు ఆట్రియమ్ లోనికి తెరుచుకుంటాయి. ఆట్రియల్ రంధ్రము పృష్టతలములో ఉంటుంది.
- ఢింబక దశలో పృష్టవంశము తోక భాగములో వుండి, ప్రౌఢ దశలో లోపించి వుంటుంది.
- శరీరాన్ని కప్పుతూ రక్షణ కొరకు ట్యూనిసిన్ అనే పదార్ధముతో నిర్మితమైన కవచము లేక కంచుకము ఉంటుంది.
- ప్రత్యుత్పత్తి మొగ్గతొడిగే విధానము వలన జరుగుతుంది. తిరోగామి రూపవిక్రియ ప్రదర్శిస్తాయి.
వర్గీకరణ
[మార్చు]అసిడియేషియా విభాగము రెండు క్రమములుగా విభిజింపబడినది. అవి[3]
- క్రమము ఎంటిరోగోనా :
- ఈ క్రమమునకు చెందిన జీవులు ఏకంత, స్ధానబద్ద జీవనము గడుపును.
- కుంచుకము లేక ట్యూనిక్ బాగా అభివృద్ధి చెందినది.
- పేగు శిక్యము దిగువన ఒకే బీజకోశము కలదు.
- మొగ్గ తొడుగు విధానములో అలింగోత్పత్తి అరుదుగా జరుగును.
- న్యూరల్ గ్రంధి నాడీసంధికి ఉదరతలములో ఉండును.
ఉదా: అసిడియా, సియోనా
- క్రమము ప్లూరోగోనా :
- ఇవి సామూహిక జీవులు
- శరీరము విభజింపబడి ఉండదు.
- న్యూరల్ గ్రంధి నాడీసంధికి పృష్టతలము ముందుగాని పార్శ్వముగా గాని ఏర్పడి ఉండును.
- బీజకోశములు రెండు ఉన్నాయి.
ఉదా: హెర్డ్మేనియా, బోట్రిల్లన్
మూలాలు
[మార్చు]- ↑ doi:10.1134/S0031030112010042
This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand - ↑ "Introduction to Ascidiacea - Sea squirts". nobanis.org. Retrieved 2015-03-03.
- ↑ "Ascidiacea". animaldiversity.org. Retrieved 2015-03-03.
- తెలుగు అకాడమీ నుండి సేకరణ