Jump to content

అబ్బె-కోనిగ్ పట్టకం

వికీపీడియా నుండి
(అబ్బె-కోనిగ్ ప్రిజం నుండి దారిమార్పు చెందింది)
In this image, the bottom left and right corners of the prism are not needed and have been cut off to reduce weight.

అబ్బే - కోనిగ్ పట్టకం అనేది ఒక పరావర్తన పట్టకం. దీనిని తలక్రిందులైన ప్రతిబింబం (180° ల భ్రమణం) ఏర్పరచడానికి ఉపయోగిస్తారు. వీటిని సాధారణంగా బైనాక్యులర్స్, టెలిస్కోపులలో ఉపయోగిస్తారు. ఈ పట్టకానికి ఎర్నస్ట్ అబ్బే, ఆల్బర్ట్ కోనిగ్ అనే శాస్త్రవేత్తల పేరుతో నామకరణం చేయడం జరిగింది.

ఈ పట్టకం రెండు దృశాపరంగా అతుకబడిన రెండు పట్టకాలతో తయారుచేయబడి ఉండి, సౌష్టవంగా గుల్లగా V - ఆకారంలో ఉంటుంది. కాంతి కిరణాలు ఒక తలంపై పతనం చెందినపుడు అంతరంగా 30° వాలు తలంపై పరావర్తనం చెందుతుంది. తరువాత దిగువ గల పట్టకం యొక్క పై తలంపై పరావర్తనం చెందుతుంది. తరువాత కాంతి ఎదురుగా ఉన్న 30° తలంపై పరావర్తనం చెంది వెలుపలికి వస్తుంది. ఈ ప్రక్రియలో వస్తువు యొక్క తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది.

మూలాలు

[మార్చు]