అణుపరీక్ష

వికీపీడియా నుండి
(అణు పరీక్ష నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భూగర్భ అణుపరీక్ష కొరకు తయారీ, 1980లో 'నెవాడా పరీక్షా ప్రదేశం' వద్ద. పరీక్ష నిర్వహణా పరికరాలు, క్రిత పరీక్షలవలన ఏర్పడిన గుంతలు (క్రేటర్లు).

అణ్వాయుధ పరీక్షలు (ఆంగ్లం: Nuclear weapons tests), అణ్వాయుధాలను పరిశోధించడానికి, చేపట్టే పరీక్షలే, ఈ అణ్వాయుధ పరీక్షలు లేదా అణుపరీక్షలు. ఇరవై శతాబ్దంలో, అనేక దేశాలు పోటా పోటీగా ఈ పరీక్షలు జరిపి, పరోక్షంగా యుద్ధరంగాలను సిద్ధం చేసాయి.

ప్రప్రథమ అణుపరీక్ష అమెరికా 1945 జూలై 16 న "ట్రినిటీ సైట్" అనే చోట, చేపట్టింది. దీని వలన 20 కిలోటన్నుల శక్తికి సమానంగా శక్తి వెలువడింది. అమెరికా చే 1952 నవంబరు 1 న మార్షల్ దీవులలో 'ఎనెవెటాక్' వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది. అతిపెద్ద అణుబాంబు సోవియట్ యూనియన్కు చెందిన త్సార్ బోంబా, 1961 అక్టోబరు 30 న 'నొవాయా జెమ్ల్యా' వద్ద పరీక్షింపబడింది. దీని శక్తి విలువ 50 మెగాటన్నులు.

అణువరీక్షల వల్ల జరిగే అనార్ధాలను సభ్యదేశాలకు అవగాహన కలిగించి, అణుపరీక్షలను నిలిపివేసేలా చేసేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. మానవ మనుగడపై ఈ వినాశకర పరిణామాలను నివారించేందుకు అణుపరీక్షల తొలగింపును ప్రోత్సహిస్తూ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.[1]

అణుపరీక్షల రకాలు

[మార్చు]
నాలుగు మేజర్ అణుపరీక్షలు : 1. వాతావరణ, 2. భూగర్భ 3. ఆవలి-వాతావరణ, 4. సముద్రగర్భ.
కాసెల్ బ్రేవో విస్ఫోటనం, 1954లో, సముద్రంలో 100 మైళ్ళ ప్రభావాన్ని కలుగజేసింది. చుట్టూ వున్న మానవసహిత దీవులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది.

అణుపరీక్షలను చారిత్రకంగా ఈ విధంగా వర్గీకరించవచ్చును.: వాతావరణ, సముద్రగర్భ,, భూగర్భ పరీక్షలు.

  • వాతావరణ పరీక్షలు భూవాతావణంలో చేపడతారు. దీనిలో కుక్కగొడుగు మేఘం (మష్రూమ్ క్లౌడ్) యేర్పడుతుంది.
  • సముద్రగర్భ పరీక్షలు, నీటి లోపల చేపడతారు. సాధారణంగా ఒక ఓడను గాని ఒక బార్జ్ను గాని అణ్వాయుధాన్ని అనుసంధానించి పేల్చివేస్తారు. ఈ పరీక్షల వలన, రేడియోధార్మిక నీరు, చుట్టు ప్రక్కల నీటి ప్రాంతాలను విపరీతంగా కాలుష్యపరుస్తుంది.
  • భూగర్భ పరీక్షలు, భూమి లోపల సొరంగాలను త్రవ్వి అందులో అణ్వాయుధాలను అమర్చి పేల్చుతారు. దీని వల్ల భూమిపై పెద్ద పెద్ద గుంతలు (క్రేటర్లు) ఏర్పడుతాయి.[2] 1974 లో భారతదేశం ఇలాంటి పరీక్షలే చేపట్టింది.

చరిత్ర

[మార్చు]
మొదటి అణుపరీక్ష 'ట్రినిటి' 1945 జూలై 16 న జరిగింది. (అమెరికా).
ప్రపంచంలోని డజనుకు పైగా ప్రదేశాలలో 2,000 కు పైగా అణుపరీక్షలు జరిగాయి.

భూమిపై మొట్టమొదటి అణుపరీక్ష జూలై 16, 1945 న అమెరికా చేపట్టింది. ఇది మాన్‌హట్టన్ కార్యక్రమంలో భాగంగా జరిగింది. దీనికి "ట్రినిటి" అని పేరు పెట్టారు. న్యూమెక్సికో లోని "అలమగోడ్రో" ప్రాంతంలో చేపట్టారు. ఈ పరీక్షా ఫలితంగా, జపాన్ పై ఆణుబాంబు ప్రయోగం జరిగింది.

దేశాల వారీగా అణుపరీక్షలు

[మార్చు]

అణు బలాలు గల దేశాలు, ఇప్పటివరకు 2,000 అణుపరీక్షలు జరిపాయి. ఈ విస్ఫోటనాలవలన, ధరిత్రికి ఏలాంటి హాని జరిగింటుందో ఊహించవచ్చు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "International Day against Nuclear Tests". United Nations. Retrieved 2020-08-29.
  2. For an overview of the preparations and considerations used in underground nuclear testing, see ""Underground Nuclear Weapons Testing" (Globalsecurity.org)". Retrieved 2006-10-19. For a longer and more technical discussion, see U.S. Congress, Office of Technology Assessment (October 1989). The Containment of Underground Nuclear Explosions (PDF). Washington, D.C.: U.S. Government Printing Office. Archived from the original (PDF) on 2013-02-27. Retrieved 2008-05-20.

వెలుపలి లంకెలు

[మార్చు]
  • Gusterson, Hugh. Nuclear Rites: A Weapons Laboratory at the End of the Cold War. Berkeley, CA: University of California Press, 1996.
  • Hacker, Barton C. Elements of Controversy: The Atomic Energy Commission and Radiation Safety in Nuclear Weapons Testing, 1947-1974. Berkeley, CA: University of California Press, 1994.
  • Schwartz, Stephen I. Atomic Audit: The Costs and Consequences of U.S. Nuclear Weapons. Washington, D.C.: Brookings Institution Press, 1998.
  • Weart, Spencer R. Nuclear Fear: A History of Images. Cambridge, MA: Harvard University Press, 1985.