Jump to content

అజిత్ కుమార్

వికీపీడియా నుండి
(అజిత్ నుండి దారిమార్పు చెందింది)
అజిత్ కుమార్
జననం
అజిత్ కుమార్ సుబ్రమణ్యం
వృత్తినటుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1992 - ఇప్పటి వరకు
జీవిత భాగస్వామిషాలిని
(2000 - ఇప్పటివరకు)
తల్లిదండ్రులుపి.సుబ్రమణ్యం,[1] మోహిని

అజిత్ కుమార్ ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను తెలంగాణ లోని సికింద్రాబాద్లో జన్మించాడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు. ప్రముఖ నటి షాలినిని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను అనర్గళముగా మాట్లాడగలడు.

అజిత్ కళా రంగానికి చేసిన సేవకుగాను 2025 సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ పురస్కారం అవార్డును జనవరి 25న ప్రకటించింది.[2][3]

నేపధ్యము

[మార్చు]

సికింద్రాబాద్ లో పుట్టిన అజిత్.. పదోతరగతి వరకు మాత్రమే చదివినా, అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంతో పాటు ఇంగ్లీషు పరిజ్ఞానం కూడా అజిత్ కు ఎక్కువే. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. నాలుగు పదుల వయసు దాటి, జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నాడు. అయినా కూడా అజిత్ కు ప్రేక్షకుల ఆదరణ అదే స్థాయిలో ఉంటోంది. మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు పొందిన అజిత్ గురించి చాలామందికి తెలియని విషయం. అతడు దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకడు. 2004లో బ్రిటిష్ ఫార్ములా తీ్ర సీజన్ లో ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్ గా పాల్గొన్నాడు. దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో మూడో స్థానం పొందాడు. రేసింగులో పాల్గొనాలనే ముందు బైకు మెకానిక్ గా జీవితం ఆరంభించాడు. ఒకసారి ప్రమాదం జరగడంతో, తర్వాత పలు వ్యాపార ఏజెన్సీలు ఆయనను మోడలింగ్ చేయాల్సిందిగా కోరాయి. అటునుంచి 1992లో ప్రేమపుస్తకం అనే తెలుగు సినిమాలో నటించాడు.

సినిమాల్లో

[మార్చు]

మొదటి రోజులు

[మార్చు]

కుమార్ ఇండియా లోని సికింద్రాబాద్ లో పుట్టాడు. తనకి చిన్నప్పుడూ తమిళ్ రాదు అయిన్నప్పటీకి సినిమా హిరోగా తమిళ హిరోగా తమిళ్ లో మంచి పేరు తెచ్చుకునాడు.అజిత్ 1999లో రమేష్ ఖన్నా తొడరమ్, సుందర్ సి రొమాంటిక్ డ్రామా ఉన్నైతేడితో మాళవికతో కలిసి తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఎస్‌జే సూర్య వాలి చిత్రంలో ద్విపాత్రాభినయం చేసిన అజిత్ ఈ సినిమాతో తన మొదటి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. ఈ సినిమా చెవిటి-మూగ సోదరుడు తన తమ్ముడి భార్యపై చూపించే ఆసక్తి చుట్టూ తిరిగింది. విమర్శకులు ఈ చిత్రాన్ని "ఇన్‌స్టంట్ క్లాసిక్"గా అభివర్ణించి, అజిత్ ప్రతిభావంతుడైన నటుడిగా నిలిచాడని గుర్తించారు. ఆనంద పూంగాత్రే, నీ వరువై ఎనలోని పాత్రలు కూడా ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి.

కొత్త శతాబ్దానికి ముందు అమర్కలం విజయవంతమైంది. ఈ సినిమా ప్రేమ, ఆప్యాయతలు వ్యక్తపరచడంలో విఫలమైన నిర్లక్ష్య యువకుడి కథను చెప్పింది. అజిత్ ఈ పాత్ర ద్వారా విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.

2000లో ముగావరీ వాణిజ్య పరంగా, విమర్శకుల పరంగా విజయవంతమైంది. సంగీత దర్శకుడి జీవితంలోని కష్టాలను చూపించే ఈ చిత్రంలో అజిత్ నటనకు రెడిఫ్ "నిజమైన విజేత"గా అభివర్ణించింది. అదే సంవత్సరంలో కందుకొండైన్ కందుకొండైన్ మల్టీ-స్టారర్ చిత్రంలో అజిత్ మెప్పు పొందాడు.

ఆ తర్వాత ధీనా, సిటిజన్ వంటి చిత్రాలు వాణిజ్య పరంగా విజయవంతమయ్యాయి. పూవెల్లం ఉన్ వాసంలో అజిత్ నటనకు తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక చలనచిత్ర పురస్కారం లభించింది.

2003 నుండి 2005 వరకు అజిత్ మోటార్ రేసింగ్‌పై దృష్టి సారించి తక్కువ చిత్రాల్లో మాత్రమే కనిపించాడు. ఎన్నై తలట్ట వరువాలా, ఆంజనేయ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయాయి. 2006లో పరమశివన్‌తో తిరిగి విజయవంతమైన పునరాగమనం చేశాడు.

అతని పెద్ద విజయం వరలారు ద్వారా వచ్చింది. మూడు విభిన్న పాత్రలు పోషించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. 2007లో బిల్లా రీమేక్‌లో అజిత్ స్టైలిష్ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు మరో నామినేషన్ తెచ్చింది.

అజిత్ తన కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ప్రతిదశలో తన నటనను మెరుగుపరుచుకుంటూ విమర్శకులు, ప్రేక్షకుల మెప్పును పొందాడు.

నటించిన సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (24 March 2023). "హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.
  2. "ఆల్‌రౌండర్‌.. అజిత్‌". Eenadu. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  3. "Balakrishna, Ajith, Shekhar Kapur, Shobana honoured with Padma Bhushan, Arijit Singh, Ricky Kej conferred with Padma Shri" (in ఇంగ్లీష్). The Indian Express. 25 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.

బయటి లింకులు

[మార్చు]