భాద్రపదమాసము
(బాధ్రపదమాసము నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
భాద్రపద మాసము (సంస్కృతం: भाद्रपद bhaadrapad) తెలుగు సంవత్సరంలో ఆరవ నెల. చాంద్రమానం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వాబాధ్ర లేదా ఉత్తరాబాధ్ర నక్షత్రం ఉండడం వలన ఇది బాధ్రపద మాసం అనబడింది. ఇది వర్షఋతువు కావున విరివిగా వర్షాలు పడును.
ఈ మాసంలో ఏకాన్న ఆహార వ్రతం చేస్తే ధనం - ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. బాధ్రపద శుక్ల తదియ నాడు జరుపుకునే హరితాళికా వ్రతం స్త్రీలకు పార్వతీ పరమేశ్వర పూజ, ఉపవాసం, జాగరణ చెప్పబడ్డాయి.[1]
బాధ్రపద శుద్ధ చవితి (వినాయక చవితి) నుంచి తొమ్మిది రాత్రులు గణపతి నవరాత్రాలు జరుపుకుంటారు. చివరిరోజున నిమజ్జనం వైభవంగా జరిపిస్తారు.
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక 1912 సంవత్సరం ఆగస్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పరీధావి సంవత్సరం బాధ్రపదమాసములో ప్రారంభమైనది.
పండుగలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ బాధ్రపద మాసం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీలు: 169-200.